తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. కుక్కుల సతీశ్ అనే వ్యక్తిని పాత కక్షల నేపథ్యంలో దుండగులు హతమార్చారు. శుక్రవారం అర్ధరాత్రి రాజేంద్రనగర్ 12 కుళాయిల జంక్షన్ వద్ద కత్తులు, బండరాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. కొన ఊపిరితో ఉన్న సతీశ్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఇతనిపై 14 కేసులు ఉన్నాయి.
రాజమహేంద్రవరంలో రౌడీషీటర్ దారుణ హత్య - రాజమండ్రి క్రైమ్ వార్తలు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సతీశ్ అనే రౌడీ షీటర్‌ను శుక్రవారం అర్ధరాత్రి దుండగులు హతమార్చారు. మద్యం మత్తులో సతీశ్‌పై దాడి చేసి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇతనిపై 14 కేసులు ఉన్నాయి.
రాజమహేంద్రవరంలో రౌడీ షీటర్ దారుణ హత్య
వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో సతీశ్‌పై దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సతీశ్ కుటుంబసభ్యులు ప్రభుత్వాసుపత్రి వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. సతీశ్ భార్య నాలుగు నెలల గర్భవతి అని ఆతని సోదరుడు చెప్పాడు.
ఇదీ చదవండి: పెరుగులంక భూ వివాదంలో ఇసుక మాఫియా లేదు: డీఎస్పీ