ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భర్త రైలులో మృతి.. భార్యకు కరోనా పాజిటివ్​..​ - rajamundry resident found dead in Purushottam Express

గయా నుంచి రాష్ట్రానికి వస్తున్న పురుషోత్తం ఎక్స్​ప్రెస్​లో.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి మరణించాడు. మృతుడు.. రాజమండ్రికి చెందిన ఆర్కిటెక్​ శ్రీనివాస్​గా రైల్వే పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని.. జమ్​షడ్​పూర్​లోని టాటానగర్​ రైల్వేస్టేషన్​లో ఉంచారు. శ్రీనివాస్ కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

railway station
పురుషోత్తం రైలులో రాజమండ్రికి చెందిన వ్యక్తి మృతి

By

Published : Apr 19, 2021, 12:21 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఆర్కిటెక్ ఇంజనీర్ శ్రీనివాస్.. గయా నుంచి రాష్ట్రానికి వస్తున్న పురుషోత్తం ఎక్స్​ప్రెస్​లో ప్రయాణిస్తున్నారు. రైలులో అతనితో పాటు భార్య విజయ, కుమారుడు కూడా ఉన్నారు. శ్రీనివాస్​ రైలులో ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యాడు. రైలు జమ్​షడ్​పూర్​లోని టాటానగర్​కు చేరుకున్న సమయంలో.. శ్రీనివాస్​ అకస్మాత్తుగా మరణించాడు. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది.. మృతదేహాన్ని టాటానగర్​ రైల్వేస్టేషన్​లో ఉంచారు. అతని భార్య విజయ, కుమారుడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. విజయకు కరోనా పాజిటివ్​గా తేలగా, కుమారుడికి నెగటివ్​గా నిర్థరణ అయ్యింది. టాటానగర్​ రైల్వే స్టేషన్​లోనే ఇద్దరిని వేర్వేరు చోట్ల ఉంచారు. శ్రీనివాస్ మృతిచెందినట్లు.. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించామని రైల్వే పోలీస్ అధికారి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details