ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆప్తబంధువులు.. అంత్యక్రియల్లో సాయం - కరోనా మృతులకు ఉచితంగా అంత్యక్రియలు అందిస్తున్న బృందం

కరోనాతో బంధాలు బలహీనమవుతున్న రోజులివి. కన్నవాళ్లే అంత్యక్రియలకు వెనకాడుతున్న సందర్భాలు. పేగుబంధమే ప్రశ్నార్థకంగా మారుతున్న సమయంలో మేమున్నామని ముందుకొచ్చింది ఓ బృందం. కరోనాతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తూ మంచి మనసును చాటుకుంటున్నారు.

ఆప్తబంధువులు.. అంత్యక్రియల్లో సాయం
ఆప్తబంధువులు.. అంత్యక్రియల్లో సాయం

By

Published : Aug 14, 2020, 8:27 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన మౌలానా కరీముల్లా, అతని స్నేహితులు ఒక బృందంగా ఏర్పడి కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ ముప్ఫై మృతదేహాలకు అంత్యక్రియలు చేశారు. మృతుల మత సంప్రదాయాలకు అనుగుణంగా అంత్యక్రియలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలలో ఎవరైనా కరోనాతో మృతి చెందారని వారికి సమాచారం రాగానే వెంటనే స్పందిస్తారు. ఆర్థికంగా వెసులుబాటు లేనివారికి దహన సంస్కార ఖర్చులు కూడా వీరే భరిస్తున్నారు.

ఇప్పటివరకు వీరు మహాప్రస్థానం వాహనాన్ని అద్దెకు నడిపేవారు. బృంద సభ్యులంతా కొంత సొమ్ము వేసుకొని ఒక అంబులెన్స్ స్వంతంగా ఏర్పాటు చేసుకున్నారు. ఒక ఫోన్ నెంబర్ ఏర్పాటు చేసి, కాల్ రాగానే వేగంగా స్పందిస్తున్నారు. కరోనా సమయంలో ఆప్తమిత్రుల్లా సాయం అందిస్తున్నారు.

ఇదీ చదవండి :ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం...తండ్రి కడచూపు దూరం

ABOUT THE AUTHOR

...view details