అంతరిక్షంలో కొత్తగా 12 గ్రహ శకలాలను గుర్తించినట్టు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత మేకా సుసత్య రేఖ తెలిపారు. అంతరిక్షంలో గ్రహ శకలాలను గుర్తించేందుకు నాసా సహకారంతో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో కేంద్రం రెండు నెలల క్రితం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.
ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రలకు చెందిన ఏడుగురు సభ్యుల బృందానికి సుసత్య రేఖ నాయకత్వం వహించారు. ఈ బృందం గుర్తించిన గ్రహ శకలాల వివరాలతో నివేదిక రూపొందించి నాసాకు వివరించారు. నాసా వాటిని ధ్రువీకరించి పత్రాలు అందించినట్టు సుసత్య రేఖ చెప్పారు.