ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శిరోముండన బాధితుడి దస్త్రం సామాజిక న్యాయశాఖకు బదిలీ - president office responds on seethanagaram sc tonsure case

tonsure victim
సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలు

By

Published : Aug 18, 2020, 7:24 PM IST

Updated : Aug 18, 2020, 8:50 PM IST

19:21 August 18

బాధితుడి వ్యవహారంపై మరోసారి స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం బాధితుడు ప్రసాద్​ కేసు దస్త్రాన్ని రాష్ట్రపతి కార్యాలయం సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర కేసుగా పరిగణించి సత్వర విచారణ చేపట్టాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యదర్శి అశోక్​కుమార్​ ఉత్తర్వులు జారీ చేశారు. 

తనకు నక్సలైట్​గా మారేందుకు అవకాశం ఇవ్వాలని సీతానగరం శిరోముండనం బాధితుడు వరప్రసాద్​.. గతంలో రాష్ట్రపతికి లేఖ రాశాడు. ఈ లేఖపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం.. రాష్ట్ర జీఏడీ సహాయ కార్యదర్శి జనార్దన్​బాబుకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. బాధితుడు ప్రసాద్​కు ఆయన్ను కలవాలని సూచించింది. అయితే జనార్దన్​బాబును కలిసినా.. సరైన స్పందన లేదని ప్రసాద్​ వాపోయాడు. ఈ క్రమంలో మరోసారి స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం.. కేసు దస్త్రాన్ని సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి..

సీఎంకు తెలిసి జరిగి ఉండదు: ఎంపీ రఘురామకృష్ణరాజు

Last Updated : Aug 18, 2020, 8:50 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details