తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గంలో ప్రజా చైతన్య యాత్రను ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ప్రారంభించారు. పట్టణంలోని ఒకటో వార్డు నుంచి ఈ యాత్ర ప్రారంభించారు. బుధవారం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఒంగోలులో ప్రజాచైతన్య యాత్ర ప్రారంభిస్తారని అన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.... పేద ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఆదిరెడ్డి భవాని చెప్పారు.
రాజమహేంద్రవరంలో ప్రజా చైతన్య యాత్ర ప్రారంభం - తెదేపా ఎమ్మెల్యే అదిరెడ్డి భవాని
రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గంలో ప్రజా చైతన్యయాత్రను తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ప్రారంభించారు. నగరంలో ప్రతీ వార్డుకు వెళ్లి ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
రాజమహేంద్రవరంలో ప్రజా చైతన్య యాత్ర ప్రారంభం