ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Postal Cover On Sir Arthur Cotton: అరుదైన గౌరవం.. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ పేరిట తపాలా కవరు

Dawaleswaram Barrage: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై బ్యారేజీ నిర్మించిన అపర భగీరథుడు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ పేరిట తపాల శాఖ ప్రత్యేక కవరు విడుదల చేసింది. సోమవారం ధవళేశ్వరంలోని కాటన్‌ మ్యూజియం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌, విశాఖపట్నం రీజియన్‌ పోస్టు మాస్టర్‌ జనరల్‌ ఎం.వెంకటేశ్వర్లు తదితరులు కవరు విడుదల చేశారు.

postal cover on sir Arthur Cotton
postal cover on sir Arthur Cotton

By

Published : Jan 11, 2022, 6:57 AM IST

Postal Cover on Sir Arthur Cotton: గోదావరి జలాలను పొలాలకు తరలించి ఈ ప్రాంత అభివృద్ధిపై చెరగని ముద్రవేసిన అపర భగీరథుడు సర్‌ ఆర్థన్‌ కాటన్‌ మహాశయుడికి అరుదైన గౌరవం లభించింది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ నిర్మాణం పూర్తయి 170 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తపాలాశాఖ ఆయన పేరిట ప్రత్యేక కవరు విడుదల చేసింది. సోమవారం ధవళేశ్వరం కాటన్‌ మ్యూజియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌తో కలిసి తపాలాశాఖ విశాఖ రీజియన్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ ఎం.వెంకటేశ్వర్లు కవరును విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ధవళేశ్వరం బ్యారేజీ గోదావరి డెల్టా ప్రాంత ప్రజలకు సంపద తెచ్చిపెట్టిందన్నారు. వెయ్యేళ్ల రాజమహేంద్రవరం చరిత్రపై తపాలాశాఖ కవరు విడుదల చేయాలని పార్లమెంటులో కోరుతానన్నారు. కార్యక్రమంలో గోదావరి డెల్టా చీఫ్‌ ఇంజినీరు ఎన్‌.పుల్లారావు, రాజమహేంద్రవరం పోస్టల్‌ సూపరింటెండెంట్‌ కె.వి.వి.సత్యనారాయణ, జలవనరుల శాఖ ఎస్‌ఈ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న కాటన్‌ వేషధారి..

ప్రత్యేక తపాలా కవరును బొమ్మూరులోని కాటన్‌ స్మారక నివాసం నుంచి కాటన్‌ వేషధారి గుర్రంపై స్వారీ చేస్తూ ధవళేశ్వరంలోని మ్యూజియానికి తీసుకెళ్లి అందించాడు.

ఇదీ చదవండి:

Public on ACCMC: 'అమరావతి కార్పొరేషన్ ఏర్పాటుపై నిరసన.. విభజనకు నిరాకరణ'

ABOUT THE AUTHOR

...view details