ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్ని ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు రద్దు చేస్తే రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెడతారని.... అభివృద్ధి ఎలా జరుగుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ కారణంగానే పోలవరం నిర్మాణం నిలిచిపోయిందని ఉండవల్లి చెప్పారు. 2021 నాటికి వైకాపా సర్కార్ పోలవరాన్ని పూర్తి చేయడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు. అలాగే రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు గతంలో ఎప్పూడూ లేవని ఆయన అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ మూడు రాజధానుల అంశం లేదని... ఇక్కడే ఎందుకిలా జరుగుతుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. పదేళ్లలో విశాఖను హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తరహాలో అభివృద్ధి చేస్తామని చెప్పడం సరికాదని అన్నారు. హైదరాబాద్‌ను అలానే చేసే నష్టపోయామని హితవు పలికారు. కార్యాలయాలు తరలిస్తే అభివృద్ధి సాధ్యం కాదని హితవు పలికారు. రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి.... పోలవరం పూర్తయితేనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.
'రివర్స్‌తో పోలవరం ఆలస్యం- 2021 నాటికి నిర్మాణం అసాధ్యం' - ఏపీ రాజధాని వార్తలు
వైకాపా సర్కార్ నిర్ణయాలతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదని ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. రివర్స్ టెండరింగ్ కారణంగానే పోలవరం ఆగిపోయిందని అన్నారు. 2021 నాటికి పోలవరం పూర్తి కావడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు.
undavalli arunkumar