తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామానికి చెందిన కొండల శివ, దుర్గల 12 ఏళ్ల కుమారుడు అభిషేక్ పుట్టినప్పటి నుంచి అచేతనంగా పడి ఉంటున్నాడు. నిలబడలేడు.. కూర్చోలేడు.. మాట్లాడలేడు.. కళ్లు పూర్తిగా తెరిచి చూడలేడు. ఆకలేస్తోందని అడగలేడు. తరచూ అతనికి ఫిట్స్ వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అప్పులు చేసి ఆసుపత్రులకు తీసుకెళ్లినా ప్రయోజనం కనిపించలేదు. తండ్రి శివ కాంక్రీటు హెల్పర్‌గా పనిచేస్తున్నారు. అతడి సంపాదన అంతంతమాత్రమే. అభిషేక్‌కు దివ్యాంగ పింఛను కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా వేలిముద్రలు, ఐరిస్ వేసే స్థితిలో లేకపోవడంతో మంజూరు కాలేదు. అధికారులు స్పందించి బాబుకు వైద్యసాయంతోపాటు వికలాంగ పింఛను అందించాలని అభిషేక్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
దివ్యాంగ పింఛను కోసం ఎదురుచూపులు - latest news in east godavari district
బిడ్డ పుట్టాడని సంతోషించేలోపు.. అతనిలో కదలిక లేకపోవటం ఆ తల్లిదండ్రులను కలవపరిచింది. మాటలేదు.. నడకలేదు.. చూపలేదు.. కనీసం కూర్చోనులేడు. అచేతనంగా పడి ఉన్న ఆ చిన్నారిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. అయినా కష్టం అనుకోకుండా బిడ్డను.. కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. కానీ ఆర్థిక సమస్యలు వారిని వేధిస్తున్నాయి. ప్రభుత్వమే తమ చిన్నారికి దివ్యాంగ పింఛన్‌తో పాటు.. వైద్యం అందించి సాయం చేయాలని కోరారు.

దివ్యాంగ పింఛన్