PAWAN KALYAN: రాజమహేంద్రవరంలో పవన్‌కల్యాణ్ శ్రమదానం వేదిక మార్పు - తూర్పు గోదావరి జిల్లా వార్తలు
13:09 October 01
రాజమహేంద్రవరంలో పవన్‌కల్యాణ్ శ్రమదానం వేదిక మార్పు..
రాజమహేంద్రవరంలో శనివారం పవన్‌కల్యాణ్ శ్రమదానం చేయనున్న వేదిక మారింది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి తూర్పు గోదావరి జిల్లాలోని హుకుంపేట బాలాజీపేటకు వేదిక మార్పు చేశారు. బాలాజీపేట కనకదుర్గమ్మ గుడి వద్ద సభ అనంతరం పవన్ శ్రమదానం చేయనున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద శ్రమదానానికి జలవనరుల శాఖ అనుమతి నిరాకరించడంతో వేదిక జనసేన వేదిక మార్చింది.
ఆనకట్టపై అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేశారు. కాగా గాంధీ జయంతి సందర్భంగా రేపు పవన్‌కల్యాణ్ శ్రమదానం చేయనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు రాజమహేంద్రవరానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు.
ఇదీ చదవండి : CM Jagan Kadapa Tour: రేపు సొంత జిల్లాకు సీఎం జగన్.. రెండు రోజుల పాటు పర్యటన