కార్తిక మాసం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో కరణం గారి వీధిలో కొలువై ఉన్న కనకదుర్గమ్మకు నేడు లక్ష గాజులతో అమ్మవారిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారికి సారె, చీరలతో పాటుగా వివిధ రకాల మధుర పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.
One Lakh Bangles Puja: దుర్గమ్మకు లక్ష గాజుల పూజ - తూర్పుగోదావరి జిల్లాలో దుర్గా మాత ఆలయాలు
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో వేంచేసిన కనకదుర్గమ్మకు నేడు లక్ష గాజులతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![One Lakh Bangles Puja: దుర్గమ్మకు లక్ష గాజుల పూజ One Lakh Bangles Puja](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13558449-519-13558449-1636184698206.jpg)
దుర్గమ్మకు లక్ష గాజుల పూజ