ఇంటర్మీడియట్ పూర్వ కమిషనర్, విశ్రాంత ఐఏఎస్ అధికారి బి.ఉదయలక్ష్మి(former ias udayalaxmi)కి కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో హైకోర్టు(high court) నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. కోర్టు తీర్పును అమలు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ...ఆమెను అరెస్ట్ చేసి తమ ముందు హాజరు పరచాలని గుంటూరు ఎస్పీని ఆదేశించింది. ఈ మేరకు విచారణను ఈనెల 29 కి వాయిదా వేస్తూ.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశాలిచ్చారు.
Non Bailable warrant: విశ్రాంత ఐఏఎస్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ - విశ్రాంత ఐఏఎస్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్

15:48 June 15
ఉదయలక్ష్మీని హాజరు పరచాలని గుంటూరు ఎస్పీకి హైకోర్టు ఆదేశం
రాజమండ్రి వీటీ జూనియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డీ రత్నకుమార్ .. ఇంతకు మందు ఇచ్చినవారితో సమానంగా కనీస టైం స్కేల్ , గ్రాంట్ ఇన్ ఎయిడ్ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనతో ఏకీభవించిన న్యాయస్థానం... విద్యాశాఖ అధికారులకు తగిన ఆదేశాలిచ్చింది. ఆదేశాలు అమలు కాకపోవడంతో 2014లో ఆయమ మరోసారి కోర్టు ఆశ్రయించగా....న్యాయస్థానం తన తీర్పును పునరుద్ఘాటించింది. ఆయన న్యాయం జరగకపోవడంతో ఆయన 2018లో మరోసారి కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. అప్పటి ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, అప్పటి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ బి.ఉదయలక్ష్మిని ప్రతివాదులుగా పేర్కొన్నారు.
తాజాగా జరిగిన విచారణలో ఆదిత్యనాథ్ దాస్ తరపు న్యాయవాది రఘువీర్ విచారణకు హాజరుకాగా .. ఉదయలక్ష్మి తరపు ఎవరూ హాజరుకాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన న్యాయమూర్తి …ఆమెపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీచేశారు. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు నోటీసు ఇచ్చారు.
ఇదీ చదవండి
Viveka Murder Case: ఇంటి పరిసర ప్రాంతాల్లో భద్రత పెంచండి: వివేకా కుమార్తె సునీత