ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... రాష్ట్రంలో కక్షపూరితమైన పాలన చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎంపీ హర్ష కుమార్‌ని ఇవాళ ఉదయం ఆయన కలిశారు. పేదల కోసం పోరాడే హర్షకుమార్‌ను 48 రోజుల పాటు జైల్లో ఉంచడం, వివిధ రకాలుగా హింసించడాన్ని తెదేపా తరఫున ఖండిస్తున్నామన్నారు. పేదల కోసం పోరాడిన హర్షకుమార్‌ని జైల్లో పెట్టడం ఎంతవరకు న్యాయమని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని డీజీపీ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ వైకాపాకు వారికి మాత్రమే ఉంటుందా అని నిలదీశారు. ద్వంద్వ నీతిని మానుకోవాలని హితవు పలికారు. బ్రిటిష్ పరిపాలన, ఎమర్జెన్సీ సమయంలోనూ మీడియా, పత్రికల పట్ల ఇంత వివక్ష లేదని దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వం దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని నిమ్మల రామానాయుడు అన్నారు.
'బ్రిటిష్ పాలనలోనూ ఇలాంటి పరిస్థితులు లేవు' - cm jagan news
రాష్ట్రంలో ద్వంద్వ నీతి కొనసాగుతోందని తెదేపా నేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ వైకాపా వారికి మాత్రమే ఉంటుందా అని డీజీపీని ప్రశ్నించారు. పేదల కోసం పోరాడిన మాజీ ఎంపీ హర్షకుమార్‌ను అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు.
nimmla ramanaidu