తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో పోలీసులు, సెబ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. గాజులగుంట గ్రామంలో ఇళ్లల్లో వంట చేసుకునే పొయ్యిలపై నాటు సారా తయారు చేస్తున్న ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్నవారిని మట్టపర్తి శ్రీనివాసరావు, చుట్టూ గొల్ల సత్యనారాయణ, గూటం నరసింహరాజుగా గుర్తించారు. వారి నుంచి 36 లీటర్ల నాటుసారా, రెండు వంట గ్యాస్ సిలిండర్లు, మూడు గ్యాస్ స్టవ్లు స్వాధీనం చేసుకున్నారు. నాటు సారా తయారీకి సంబంధించిన 950 లీటర్ల బెల్లపుఊటను పోలీసులు ధ్వంసం చేశారు.
SEB Raids: ఇళ్లలో నాటుసారా తయారీ..950 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - తూర్పుగోదావరి జిల్లాలో నాటుసారా తయారీ
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో పోలీసులు, సెబ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఇళ్లలో నాటుసారా తయారు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇళ్లలో నాటుసారా తయారీ....950 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసిన పోలీసులు