'దిశ ఎన్కౌంటర్ను సీఎం సమర్థించటం రాజ్యాంగ విరుద్ధం' - mrps madha krishna respond on jagan comments on disha
దిశ నిందితులను ఎన్కౌంటర్ను సీఎం జగన్ సమర్థించటం... రాజ్యాంగాన్ని అవమానించడమే అని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఇది సరైన నిర్ణయమని భావిస్తే... అన్ని అత్యాచార కేసులకు ఇలాంటి ధోరణినే అవలంభించాలని ఆయన సూచించారు.
దిశ నిందితుల ఎన్కౌంటర్ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమర్థించడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఇది న్యాయమని భావిస్తే తెలుగు రాష్ట్రాల్లో సామూహిక అత్యాచారానికి గురైన ఎంతో మంది బాలికలు ఉన్నారని... ఆ కేసుల్లో నిందితులు ప్రధానంగా ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని గుర్తు చేశారు. దిశ చట్టం తీసుకొచ్చినట్లుగానే ... అవినీతిపరులకు త్వరితగతిన కఠిన శిక్ష పడేలా జగన్ చట్టం తీసుకు వస్తారా అని మందకృష్ణ ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం వస్తే అవినీతిపరులకు శిక్ష పడే చట్టాన్ని తీసుకు రావాలని కోరుతానని అన్నారు.