తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎంపీ మార్గాని భరత్ చేపట్టిన ధన్వంతరీ సహిత మహా సుదర్శన యాగం, రాజశ్యామల సహిత మహా రుధ్రాభిషేకం పూర్తయ్యాయి. ఈరోజు జరిగిన పూర్ణాహుతిలో ఎంపీ భరత్ దంపతులు పాల్గొన్నారు. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి కార్యక్రమానికి హాజరయ్యారు. కరోనా అంతమయ్యి రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేందుకు యాగం నిర్వహించినట్లు ఎంపీ తెలిపారు.
కరోనా అంతమవ్వాలని ఎంపీ భరత్ చేపట్టిన యాగం పూర్తి - mp margani bharat yaagam news
కరోనా అంతమయ్యి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ చేపట్టిన యాగం పూర్తయ్యింది. ఈరోజు జరిగిన పూర్ణాహుతి కార్యక్రమానికి ఎంపీ దంపతులతో పాటు విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి హాజరయ్యారు.

ఎంపీ భరత్ చేపట్టిన యాగం పూర్తి