అసైన్డ్ భూముల వ్యవహారంలో 41 సీఆర్పీసీ ప్రకారం సీఎం జగన్, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాలని మాజీ ఎంపీ హర్షకుమార్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీల నుంచి నవరత్నాల కోసం భూములు బలవంతంగా లాక్కున్నారని.., వారికి ఎలాంటి పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు.
'సీఎం జగన్, మంత్రులు బొత్స, ధర్మానను అరెస్టు చేయాలి' - జగన్‌పై మాజీ ఎంపీ హర్షకుమార్ కామెంట్స్
అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఎం జగన్, మంత్రులపై మాజీ ఎంపీ హర్షకుమార్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. 41 సీఆర్పీసీ ప్రకారం సీఎం జగన్, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాలని కోరారు.
'సీఎం జగన్, మంత్రులు బొత్స, ధర్మానను అరెస్టు చేయాలి'
అసైన్డ్ భూముల వ్యవహారంలో వైకాపా నాయకులకు లబ్ధి చేకూరగా.., ఎస్సీ, ఎస్టీలు నిరాశ్రయులయ్యారన్నారు. ఈ మేరకు సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆయన రాజమహేంద్రవరంలో వెల్లడించారు.
ఇదీచదవండి: 'రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది'