ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సహస్ర జ్యోతిర్లింగ దీపార్చన నిర్వహించిన ఎంపీ భరత్​రాం - రాజమండ్రిలో సహస్ర జ్యోతిర్లింగ దీపార్చన

నదీ తీరంలో అద్భుతం ఆవిష్కృతమైంది. వెయ్యి దీపాల కాంతులతో ఆ ప్రాంగణమంతా దేదీప్యమానంగా వెలిగిపోయింది. వైరస్ బాధ తొలగిపోవాలంటూ.. ఎంపీ మార్గాని భరత్​రాం రాజమహేంద్రవరంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

thousand lights lit up in rajahmundry
రాజమహేంద్రవరంలో సహస్ర జ్యోతిర్లింగ దీపారాధన

By

Published : Oct 25, 2020, 9:17 AM IST

గోదావరి తీరంలో సహస్ర జ్యోతిర్లింగ దీపారాధన భక్తిశ్రద్ధలతో చేపట్టారు. రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌ వద్ద శివలింగం ఆకృతిలో దీపాలు అలంకరించి మహిళలు పూజలు నిర్వహించారు. కరోనా పీడ తొలగిపోవాలని ఎంపీ మార్గాని భరత్‌రాం ఈ కార్యక్రమం ప్రారంభించారు.

రాజమహేంద్రవరం నగరాన్ని చారిత్రక వారసత్వ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నట్లు ఎంపీ తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు.

ABOUT THE AUTHOR

...view details