రాష్ట్రంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు, అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయిస్తోందని భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాజమహేంద్రవరంలో అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం...ఇళ్ల నిర్మాణాలను తమ పథకాలుగానే ప్రచారం చేసుకుంటోందని అన్నారు. ఏడు వేల కోట్ల రూపాయలతో భూముల కొని 22వేల కోట్ల రూపాయల ఆస్తి అంటూ వైకాపా గొప్పలు చెప్పుకుంటోందని దుయ్యబట్టారు. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల్లో 30 లక్షల ఇళ్లను ఎలా నిర్మిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇళ్ల స్థలాల పంపిణీలో కేంద్రం నిధులున్నాయి: సోము వీర్రాజు - ఏపీలో ఉచిత ఇళ్ల పట్టాలు
ఇళ్ల నిర్మాణాలకు నిధులు కేంద్రం నుంచి వస్తున్నా... రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తమ పథకాలుగానే ప్రచారం చేసుకుంటున్నాయని భాజపా నేత సోము వీర్రాజు విమర్శించారు.
mlc somu veeraju