రాజమహేంద్రవరంలో వైకాపా కో ఆర్డినేటర్‌ను మార్చటంపై ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సమావేశం నిర్వహించారు. పదవుల కోసం డబ్బులు వెదజల్లే సంస్కృతి తమది కాదని రాజా అన్నారు. మాజీ కో ఆర్డినేటర్ శివరామసుబ్రహ్మణ్యం అవసరం వైకాపాకు ఉందని చెప్పారు. సీఎం జగన్‌ను దూషించిన వారిని వైకాపాలోకి తీసుకురావటం వల్లే ఎంపీ భరత్‌తో విభేదాలు వచ్చాయని రాజా తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైకాపా, ముఖ్యమంత్రి జగన్ తోనే కలిసి ముందుకు సాగుతామని రాజా చెప్పారు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైకాపాతోనే ముందుకు సాగుతాం.. - రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే జక్కంపూడి సమావేశం
రాజమహేంద్రవరంలో వైకాపా కోర్డినేటర్లను మార్చటంపై ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తన వర్గీయులతో సమావేశం నిర్వహించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైకాపా, ముఖ్యమంత్రి జగన్‌తోనే కలిసి ముందుకు సాగుతామని రాజా చెప్పారు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైకాపాతోనే ముందుకు సాగుతాం
పదవులు ఉన్నా లేక పోయినా వైకాపా బలోపేతానికి కృషి చేస్తామని మాజీ కో ఆర్డినేటర్ శివరామసుబ్రహ్మణ్యం తెలిపారు. జక్కంపూడి గణేశ్(రాజా తమ్ముడు) .. ఒక వ్యక్తి కాదని శక్తి అని... అతనితో కలిసి ముందుకు సాగాతానని ఆయన అన్నారు. రాజమహేంద్రవరం నగరం, గ్రామీణ వైకాపా నూతన కో ఆర్డినేటర్లుగా ప్రసుత్తం ఆకుల సత్యనారాయణ, చందన నాగేశ్వర్లు ఉన్నారు.
ఇదీ చదవండీ..విశాఖ ఉక్కు పరిశ్రమను విక్రయిస్తే రాష్ట్రమే కొంటుంది: మంత్రి గౌతమ్‌రెడ్డి