ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మడ అడవుల్లో భూ కుంభకోణం.. బురదకాల్వల్లో ఇళ్ల స్థలాలు' - వైసీపీ నేతలపై గోరంట్ల కామెంట్స్

కరోనా నివారణ చర్యలపై దృష్టి సారించకుండా వైకాపా భూకుంభకోణాలకు పాల్పడుతోందని తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. కాకినాడ వద్ద మడ అడవుల్లో భూసేకరణ చేపట్టడంపై మండిపడ్డారు.

తెదేపా నేత గోర్లంట బుచ్చయ్య చౌదరి
తెదేపా నేత గోర్లంట బుచ్చయ్య చౌదరి

By

Published : May 2, 2020, 2:32 PM IST

Updated : May 2, 2020, 4:08 PM IST

కరోనా నివారణపై దృష్టి మాని రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అని వైకాపా నేతలు చూస్తున్నారని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. కాకినాడ వద్ద మడ అడవులను ధ్వంసం చేసి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని విమర్శించారు. బురద కాల్వలు ఉన్నచోట భూములు ఇస్తున్నారన్నారు.

వైకాపా నేతలు భూ సేకరణలో అవకతవకలకు పాల్పడుతున్నారని గోరంట్ల ఆక్షేపించారు. వరద ప్రాంతంలో ఇళ్ల స్థలాల పేరిట దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. కరోనాతో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం భూసేకరణ ఎలా చేస్తుందని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏంచేస్తున్నారని నిలదీశారు. భూకుంభకోణాలపై విచారణ జరపాలని గోరంట్ల డిమాండ్ చేశారు.

Last Updated : May 2, 2020, 4:08 PM IST

ABOUT THE AUTHOR

...view details