వైకాపా ప్రభుత్వం ముందు చూపు లేకుండా ఇళ్ల స్థలాలు సేకరిస్తోందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. విద్యాసంస్థలకు కేటాయించిన భూములను, దేవాదాయ శాఖ భూములను... ఇళ్లస్థలాలకు కేటాయించడమేమిటని ప్రశ్నించారు. చెరువులను పూడ్చే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ భూములను కోర్టు అనుమతి లేకుండా తీసుకోవడం కుదరదని స్పష్టం చేశారు. ఎవరైనా ప్రభుత్వ విధానాలపై సిట్ వేస్తారా? అని నిలదీశారు. గతంలో ఇచ్చిన పట్టాలని రద్దు చేయడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది ఒక చేతగాని అసమర్థ ప్రభుత్వం అని గోరంట్ల ఎద్దేవా చేశారు.
'ముందు చూపులేకుండా వ్యవహరిస్తారా?' - బుచ్చయ్య చౌదరి తాజా న్యూస్
ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కొనలేక... దేవాదాయాల, విద్యాలయాలకు సంబంధించిన భూములపై కన్నేసిందని తెదేపా నేత, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రభుత్వం ముందు చూపు లేకుండా వ్యవహరిస్తోందని ఆయన ఆక్షేపించారు.
'ఇళ్ల స్థలాల సేకరణలో... ముందు చూపులేకుండా వ్యవహరిస్తారా?'