అంబేడ్కర్ ఆశయాల సాధన దిశగా ముఖ్యమంత్రి జగన్ పాలన సాగుతోందని... వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో జగన్ ముందుకెళ్తున్నారని రాజమహేంద్రవరంలో వ్యాఖ్యానించారు. అన్ని వ్యవస్థలను పాడు చేసిన చరిత్ర చంద్రబాబుదేనన్న మంత్రి... అలాంటి వ్యక్తి రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధానిలో రాళ్లు ఎత్తిన కూలీలు కనపడడం లేదన్న తెదేపా నేతల వ్యాఖ్యలపై కన్నబాబు మండిపడ్డారు. రాజధానిలో చంద్రబాబు బినామీలు కనబడుతున్నారని ఆరోపించారు.
రాజ్యాంగ స్ఫూర్తితో జగన్ పాలన: కన్నబాబు - kannababu fire on chandrababu news
రాజ్యాంగ స్ఫూర్తితో ముఖ్యమంత్రి జగన్... ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. అమరావతి గురించి తెదేపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
minister-kannababu-comments-on-chandrababu-over-amaravthi-issue