ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కరోనా మన చుట్టూ తిరుగుతోంది.. జాగ్రత్తలు పాటించండి' - Covid-19 Effected College News

రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కాతేరులోని విద్యాసంస్థల్లో.. కరోనా బారిన పడిన విద్యార్థులకు వైద్యులు నిరంతర వైద్యం అందిస్తున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్పారు. ఆందోళన వద్దని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.

మంత్రి వేణుగోపాలకృష్ణ
మంత్రి వేణుగోపాలకృష్ణ

By

Published : Mar 24, 2021, 9:29 PM IST

మంత్రి వేణుగోపాలకృష్ణ

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కాతేరులో విద్యార్థులకు కొవిడ్ సోకిన తిరుమల విద్యాసంస్థల్ని... మంత్రి వేణుగోపాలకృష్ణ పరిశీలించారు. 175 మంది విద్యార్థులకు కరోనా నిర్థరణ అయిందని చెప్పారు. ప్రభుత్వ వైద్యులు 24 గంటలు విద్యార్థులకు సేవలు అందిస్తున్నారన్నారు.

ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. బాధితులకు అందిస్తున్న సౌకర్యాల్ని తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్ తిరుమలరావు మంత్రికి వివరించారు. కరోనా మన చుట్టూ తిరుగుతోందని.. జాగ్రత్తలు పాటించకపోతే మరోసారి లాక్​డౌన్ ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details