తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి సుమారు 350 మంది బిహార్‌కు చెందిన వలస కార్మికులను అధికారులు వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. కూలీలు ఉపాధి కోసం ఇక్కడకు వచ్చి లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయారు. తమను స్వస్థలాలకు పంపించాలని అధికారులకు ధరఖాస్తు చేసుకున్న క్రమంలో.. అర్హతలు ఉన్నవారందరినీ బస్సుల్లో కొవ్వూరు తరలించి అక్కడ నుంచి శ్రామిక్ ఎక్స్‌ప్రెస్‌లో బిహార్ పంపించనున్నారు. అయితే తమ వద్ద నుంచి రూ.1000 వసూలు చేస్తున్నారని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరం నుంచి వలస కూలీల తరలింపు
లాకడౌన్‌తో రాజమహేంద్రవరంలో చిక్కుకున్న బిహార్ వలస కూలీలను అధికారులు స్వస్థలాలకు తరలిస్తున్నారు.
స్వస్థలాలకు చేర్చాలని వలస కార్మికుల విజ్ఞప్తి