పొట్ట చేత పట్టుకుని.. బతుకు బండిని లాగేందుకు వచ్చిన వలస బతుకులకు కరోనా కష్ట కాలాన్ని తెచ్చింది. సొంతూళ్లకు వెళ్లలేక.. ఉన్న చోట తిండి దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు వలస కార్మికులు. ఉభయగోదావరి జిల్లాల్లో ఉత్తరప్రదేశ్ వలస కార్మికులు లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకున్నారు. పానీపూరి అమ్ముకోవడంతో పాటు నిర్మాణరంగంలోనూ 23 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రత్తిపాడు, రంపచోడవరం మండలాల్లో క్వారంటైన్ పూర్తిచేసుకున్న కార్మికులను స్వరాష్ట్రానికి పంపేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. 5 రోజులుగా ఆరుబయటే తిండితిప్పలు లేకుండా రాజమహేంద్రవరంలో అవస్థలు పడుతున్నారు. తామంతా యూపీలోని ఆగ్రా, రాయబరేలీ, అమీర్‌పూర్, హస్రత్, కబీర్‌నగర్ తదితర జిల్లాలకు చెందినవారమని తెలిపారు. తాము తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయని తక్షణం స్వస్థలాలకు పంపాలని యూపీ వలస కార్మికులు వేడుకుంటున్నారు.
ఆరుబయటే తిండి.. చేతిలో డబ్బులు ఖాళీ - యూపీ వలస కార్మికులపై లాక్‌డౌన్ ఎఫెక్ట్ న్యూస్
లాక్‌డౌన్‌తో వలస కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కొంతమంది కాళ్లరేగిలా.. వందల కిలోమీటర్లు నడుస్తుంటే.. మరికొందరు.. ఎవరైనా సాయానికి చేయి అందించారా? అని ఎదురు చూస్తున్నారు. అలా .. ఉభయగోదావరి జిల్లాల్లో ఉత్తరప్రదేశ్ వలస కార్మికులు కష్టాల గోదారి ఈదుతున్నారు. అటు ఇంటికి వెళ్లలేక. ఇటు.. తిండి లేక అవస్థలు పడుతున్నారు.
migrant labours facing problems in rajamahendravaram