సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు ఉదయం.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో ఆచార్య సినిమా చిత్రీకరణ కోసం వచ్చిన ఆయనకు.. అభిమానులు ఘన స్వాగతం పలికారు. అలాగే విమానాశ్రయం బయట భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.
చిరంజీవి విమానాశ్రయానికి చేరుకోగానే.. అభిమానులు పూలమాలలు వేసి నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. వారికి మెగాస్టార్ అభివాదం చేశారు. అనంతరం విమానాశ్రయం నుంచి బూరుగుపూడి చెక్ పోస్ట్ వరకు అభిమానులు ర్యాలీ నిర్వహించారు. ఇదే చిత్ర విషయమై గత నాలుగురోజులుగా సినీ నటుడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మారేడుమిల్లిలోని షూటింగులో ఉన్నారు.