'ప్రజలకు అందుబాటులో... 'కరోనా' నివారణ ఔషధాలు'
కేవలం అల్లోపతి పద్ధతిలోనే కాకుండా హోమియోపతి, ఆయుర్వేదం, యునానీ వంటి చికిత్సా పద్ధతుల్లో కూడా కరోనా వైరస్‌ని నివారించే ఔషధాలు అందుబాటులో ఉన్నట్లు రాజమహేంద్రవరంలో వైద్యాధికారులు తెలిపారు. ప్రజలు సైతం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
రాజమహేంద్రవరంలోని అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాలలో కరోనా వైరస్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ, ఆయుష్ విభాగం అధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి, లక్షణాలు, నివారణ చర్యలను వైద్యులకు తెలియజేశారు. కేవలం అల్లోపతి పద్ధతిలోనే కాకుండా హోమియోపతి, ఆయుర్వేదం, యునానీ వంటి చికిత్సా పద్ధతుల్లో కూడా కరోనా వైరస్‌ని నివారించే ఔషధాలు అందుబాటులో ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ చర్యలు చేపడతామని తెలిపారు. కరోనా వైరస్ పీడితుల కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామని వైద్యాధికారులు తెలిపారు.