ఈరోజు ఉదయం నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజుపేట తండా గ్రామ శివారులో కృష్ణ నాయక్‌కు చెందిన పొలంలో చిరుత కనిపించింది. పంటకు రక్షణ కోసం ఏర్పాటు చేసిన ముళ్లకంచెలో చిరుత ఇరుక్కుంది. చిరుతను రక్షించేందుకు అటవీశాఖ అధికారులు శ్రమించారు. ముళ్లకంచె నుంచి తప్పించేందుకు గంటల తరబడి యత్నించారు. ఎట్టకేలకు చిరుతను సురక్షితంగా బోనులో బంధించారు. ఈ క్రమంలో ఇద్దరు అటవీశాఖ సిబ్బందికి గాయాలైన విషయం తెలిసిందే.
తెలంగాణ: నల్గొండ జిల్లాలో అటవీ అధికారులు బంధించిన చిరుత మృతి - leopard died in nalgonda dist
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో అటవీ అధికారులు బంధించిన చిరుత మృతి చెందింది. హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు నెహ్రు జంతుప్రదర్శన శాల క్యూరేటర్ తెలిపారు. మృతిచెందిన చిరుతకు పశువైద్యుల బృందం శవపరీక్ష చేసింది.
![తెలంగాణ: నల్గొండ జిల్లాలో అటవీ అధికారులు బంధించిన చిరుత మృతి leopard died in nalgonda dist marriguda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7383639-686-7383639-1590669483160.jpg)
leopard died in nalgonda dist marriguda