ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దాడులు ఆపడంలో పోలీసులు విఫలం... అంబేడ్కర్ జిల్లా సాధన సమితి - Leaders of the Ambedkar District Sadhana Samithi

Ambedkar District Sadhana Samiti: అమలాపురంలో మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడులను నిలువరించడంలో పోలీసులు విఫలమయ్యారని.. అంబేడ్కర్ జిల్లా సాధన సమితి నాయకులు అన్నారు.

Ambedkar District Sadhana Samiti
Ambedkar District Sadhana Samiti

By

Published : May 25, 2022, 5:58 PM IST

దాడులు ఆపడంలో పోలీసులు విఫలం...అంబేడ్కర్ జిల్లా సాధన సమితి

Ambedkar District Sadhana Samiti: అమలాపురంలో మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడులను నిలువరించడంలో పోలీసులు విఫలం అయ్యారని.. అంబేడ్కర్ జిల్లా సాధన సమితి నాయకులు అన్నారు. మంటల్లో కాలిన ఇంటిని మంత్రి విశ్వరూప్ పరిశీలించే సమయంలో అక్కడికు వచ్చిన అంబేడ్కర్‌ జిల్లా సాధన సమితి నాయకులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Minister Vishwaroop: నిన్నటి ఘటనలో దహనమైన తన ఇంటిని మంత్రి విశ్వరూప్​ పరిశీలించారు. ర్యాలీకి పిలుపునిచ్చిన కోనసీమ సాధన సమితి బాధ్యత తీసుకోవాలని విశ్వరూప్‌ అన్నారు. కొంతమంది సంఘ విద్రోహశక్తులు ర్యాలీలోకి చొరబడ్డారని ఆరోపించారు. అమలాపురం ప్రజలకు ఎలాంటి తప్పుడు ఆలోచనలు లేవన్నారు. ఉద్యమం ముసుగులో కొంతమంది రౌడీషీటర్లు చొరబడ్డారని ఆరోపించారు. ముందుగా అనుకున్న ప్రకారమే తన ఇంటిపై దాడి చేశారని తెలిపారు. ఈ ఘటనలో తెదేపా, జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారన్నారు. అయితే ఈ ఘటనలో వైకాపాతో పాటు ఎవరున్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తమ కుటుంబసభ్యులంతా క్షేమంగా ఉన్నామని తెలిపారు. అమలాపురం ప్రజలంతా సంయమనం పాటించాలని కోరారు. అంబేడ్కర్‌ పేరు పెట్టాలని అన్ని పార్టీలు కోరాయని మంత్రి విశ్వరూప్‌ అన్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details