అమరావతి దళిత రైతులకు సంకెళ్లు వేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు జాతీయ మానవ హక్కుల సంఘం-ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. అన్నదాతలకు బేడీలు వేయడం చట్ట విరుద్ధమని ఆయన తెలిపారు. ఎస్సీ వర్గానికి చెందిన రైతులపై అట్రాసిటీ చట్టం ప్రకారం రిమాండ్ కోరడం అధికార దుర్వినియోగమని అభిప్రాయపడ్డారు.
రైతులకు సంకెళ్లపై ఎన్హెచ్ఆర్సీకి ముప్పాళ్ల ఫిర్యాదు
అమరావతి రైతులకు సంకెళ్లు వేసిన ఘటనపై ఏపీ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, రైతులకు బేడీలు వేయడం చట్ట విరుద్ధమని ఆయన అన్నారు.
Lawyer muppalla subbarao
రిమాండ్ కోరిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. బాధిత రైతులకు నష్ట పరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ముప్పాళ్ల సుబ్బారావు ఎన్హెచ్ఆర్సీకి నివేదించారు.
ఇదీ చదవండి :రైతులకు సంకెళ్లు వేసిన పోలీసులపై సస్పెన్షన్ ఎత్తివేత