తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం 49వ డివిజన్ క్వారీ ప్రాంతంలో జరుగుతున్న గంజాయి, నాటు సారా అమ్మకాలను, అమ్మకం దారులకు సహకరిస్తున్న అధికారులకు వ్యతిరేకంగా డివిజన్ మాజీ కార్పొరేటర్ బర్రె అనుహెలీనియా ఆధ్వర్యంలో ఆ ప్రాంత మహిళలు నిరసన తెలిపారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సారా అమ్మకాలు నిషేధించాలని... అమ్మకం దారులకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని ఆ ప్రాంత మహిళలను కాపాడాలని నినాదాలు చేస్తూ దానికి సంబంధించిన వినతిపత్రాన్ని ఎక్సైజ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్ నాగ ప్రభుకుమార్కు అందజేశారు. సారారహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఎక్సైజ్ అధికారులంతా పనిచేస్తున్నారాని సూపరింటెండెంట్ తెలిపారు.మహిళలకు ఇబ్బంది కలగకుండా అక్రమ వ్యాపారాలను అరికడతామన్నారు.
నాటు సారా, గంజాయి అమ్మకాలు అరికట్టమని మహిళల ధర్నా - illegal ganzai
రాజమహేంద్రవరంలోని 49వ డివిజన్ క్వారీ ప్రాంతంలో గంజాయి, నాటు సారా అమ్మకాలు విచ్చల విడిగా జరుగుతున్నాయని వాటిని అరికట్టమని ఆ ప్రాంత మహిళలు ధర్నా చేశారు. ఉన్నతాధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు.
![నాటు సారా, గంజాయి అమ్మకాలు అరికట్టమని మహిళల ధర్నా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3845808-825-3845808-1563194146911.jpg)
నాటు సారా, గంజాయి అమ్మకాలు అరికట్టమని మహిళల ధర్నా
నాటు సారా, గంజాయి అమ్మకాలు అరికట్టమని మహిళల ధర్నా
ఇదీ చదవండి :