రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా దిగజారిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar Fires On YSRC Govt) అన్నారు. రాష్ట్రాన్ని దివాళా తీయించే దిశగా(financial crisis in andhra pradesh) పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేటలో పర్యటించిన ఆయన (Nadendla Manohar tour in eastgodavari district) కార్తీక వన సమారాధనలో పాల్గొన్నారు.
అధికార పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరగకుండా ఎన్ని విధాల యత్నించినా.. అడ్డుకోవడంలో జనసైనికులు సఫలమయ్యారని అన్నారు. పేదలకు కుట్టుమిషన్లు, నగదు పంపిణీ చేశారు. అనంతరం ఇటీవల ప్రమాదంలో చనిపోయిన పండూరుకు చెందిన జనసేన క్రియాశీల సభ్యుడు ముమ్మిడి రమేష్ కుటుంబాన్ని పరామర్శించి.. 5లక్షల బీమా చెక్కును అందించారు.