ఇవాళ తాము తలపెట్టిన 'చలో అంతర్వేది' కార్యక్రమాన్ని విరమించుకుంటున్నట్లు జనసేన ప్రకటించింది. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ కోరాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ తెలిపారు. జనసేన, భాజపా, ధార్మికుల ఒత్తిడి వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. దోషులకు తప్పనిసరిగా శిక్ష పడుతుందనే విశ్వాసం ప్రజల్లో కలుగుతోందన్నారు. ఏ మతస్థుల మనోభావాలు దెబ్బ తినకూడదనేది జనసేన అభిమతమని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు.
- ఇది హిందూ బంధువుల విజయం: సోమువీర్రాజు
అంతర్వేది రథం దగ్ధంపై.... భాజపా-జనసేన తలపెట్టిన 'చలో అంతర్వేది'కి ఉలిక్కిపడి.... ఈ ఘటనపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఇది హిందూ బంధువుల విజయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన ఇరు పార్టీల నేతలకు అభినందనలు తెలియచేశారు. అంతర్వేది ఘటనలో ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిన హిందువులందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారిపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకునేవరకూ నిరసనలు ఆపబోమన్నారు.
ఇదీ చదవండి:అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సీఎం నిర్ణయం