ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజమహేంద్రవరంలో అంతర్ జిల్లా అథ్లెటిక్స్

సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధిస్తామని మంత్రి తానేటి వనిత అన్నారు. రాజమహేంద్రవరంలో 6వ అంతర్ జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలను ప్రజాప్రతినిధులతో కలిసి ఆమె ప్రారంభించారు. చదువుతోపాటు క్రీడలను స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి సూచించారు.

రాజమహేంద్రవరంలో అంతర్ జిల్లా అథ్లెటిక్స్

By

Published : Oct 4, 2019, 11:44 PM IST

రాజమహేంద్రవరంలో అంతర్ జిల్లా అథ్లెటిక్స్

కష్టపడితే సాధించలేనిది ఏదీ ఉండబోదని రాష్ట్ర మహిళా - శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. స్థానిక రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన 6వ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చదువుతోపాటు క్రీడలను స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి అన్నారు . రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు భారత్ మాట్లాడుతూ అంతర్ జిల్లాల క్రీడలు రాజమహేంద్రవరంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నామని, 14, 16 ,18, 20 సంవత్సరాల వయసుగల సుమారు 1000 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగామ సురేష్ , గోపాలపురం శాసనసభ్యులు టి.వెంకట్రావు, నిడదవోలు శాసనసభ్యులు జి.శ్రీనివాస్ నాయుడు, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details