సీఎం జగన్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా వైఎస్ వివేకా హత్యకేసు దోషులను ఎందుకు పట్టుకోలేదని మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రశ్నించారు. బెయిల్పై విడుదలైన హర్షకుమార్ను శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆయన నివాసంలో పరామర్శించారు. ప్రభుత్వంతో పాటు సీఎం జగన్ తీరుపై హర్షకుమార్ మండిపడ్డారు. రాజధాని తరలింపు సరికాదని అభిప్రాయపడ్డారు. సుందరమైన ప్రాంతంగా పేరున్న విశాఖ ఔన్నత్యాన్ని దెబ్బతీయొద్దని వ్యాఖ్యానించారు. తనపై వైకాపా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు.
'వివేకా హత్య కేసు దోషులను ఎందుకు పట్టుకోలేదు..?' - Harshakumar comments on cm ys jagan news'
ఏడు నెలలు దాటినా వివేకా హత్య కేసు దోషులను ఎందుకు పట్టుకోలేదని మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రశ్నించారు. కేసు దర్యాప్తును సీబీఐ విచారణకు ఎందుకు ఇవ్వట్లేదని ఆయన కుమార్తె హైకోర్టును ఆశ్రయించిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు.
!['వివేకా హత్య కేసు దోషులను ఎందుకు పట్టుకోలేదు..?' Harshakumar comments on cm ys jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5908626-466-5908626-1580467616751.jpg)
Harshakumar comments on cm ys jagan