రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ తెదేపా నేతలు రాజమహేంద్రవరంలో సంతకాల సేకరణ చేపట్టారు. పార్టీ స్థానిక కార్యాలయంలో సంతకాల సేకరణను నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతూ నూతన సంవత్సవ శుభాకాంక్షలను తెలిపే కార్డులపై ప్రజలు సంతకాలు చేశారు. అమరావతిపై ప్రజల మద్దతు కోరుతూ సంతకాల సేకరణ చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని తెలిపారు. ఈ కార్డులను ముఖ్యమంత్రికి పంపుతామని అన్నారు.
రాజధానిని మార్చొద్దంటూ... ముఖ్యమంత్రికి గ్రీటింగ్ కార్డులు - ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని వార్తలు
రాజధాని విషయంలో రాజమహేంద్రవరం ప్రజలు వినూత్నంగా నిరసన తెలిపారు. అమరావతికి అన్యాయం చేయొద్దంటూ గ్రీటింగ్ కార్డులపై సంతకాలు చేశారు. వీటిని ముఖ్యమంత్రికి పంపనున్నారు.
ముఖ్యమంత్రికి గ్రీటింగ్ కార్డులు