ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'స్థానిక సంస్థలకు సీఎం శఠగోపం పెట్టారు' - వైకాపా ప్రభుత్వంపై గోరంట్ల బచ్చయ్య చౌదరి

స్థానిక సంస్థలకు వైకాపా ప్రభుత్వం శఠగోపం పెట్టిందని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. స్థానిక సంస్థల్లో ఏ అభివృద్ధీ చేపట్టలేదని విమర్శించారు.

gorantla buchaiyya choudary on local bodies
తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

By

Published : Oct 10, 2020, 2:46 PM IST

న్యాయస్థానాల్లో రాజకీయ నాయకులపై పెండింగ్ కేసుల విచారణ త్వరగా పూర్తైతే, రాజ్యాధినేతలెవ్వరో, జైలుకెళ్లేవారెవ్వరో తేలిపోతుందని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్థానిక సంస్థలకు జగన్ ప్రభుత్వం శఠగోపం పెట్టిందని ధ్వజమెత్తారు. లక్షల కోట్లు అప్పులు తెచ్చామనే ప్రభుత్వం.. స్థానిక సంస్థల్లో ఏ అభివృద్ధీ చేపట్టలేదని విమర్శించారు.

నరేగా కింద కేంద్రం మంజూరు చేసిన రూ.2వేల కోట్లకుపైగా నిధులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను వేధిస్తున్నారని గోరంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాదారులాగా మారిన మంత్రులపై అన్ని సాక్ష్యాలతో అవినీతి బయటపడుతున్నా ఎలాంటి చర్యలు లేవని తప్పుబట్టారు. న్యాయవ్యవస్థ లేకపోతే అరాచకం ఎక్కడికి చేరేదోనని గోరంట్ల ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి: మూడు శతాబ్దాలుగా ఆ గ్రామంలో మద్యపాన నిషేధం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details