ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అక్రమాస్తుల కేసుల్లో జగన్​కు శిక్ష ఖాయం' - సీబీఐ కోర్టులో జగన్​కు షాక్ వార్తలు

అక్రమాస్తుల కేసుల్లో జగన్​కు శిక్ష పడటం ఖాయమని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన వాళ్లు తెదేపా నేతలపై అసత్య ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు.

gorantla buchaiah chowdary comments on jagan cbi cases
gorantla buchaiah chowdary comments on jagan cbi cases

By

Published : Feb 14, 2020, 12:25 PM IST

మాట్లాడుతున్న బుచ్చయ్య చౌదరి

సీఎం జగన్​పై తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అక్రమాస్తుల కేసులో జగన్​కు శిక్ష పడటం ఖాయమని జోస్యం చెప్పారు. కేసుల విచారణకు జగన్ ఎందుకు సహకరించట్లేదని ప్రశ్నించారు. పదవులతో సంబంధం లేకుండా విచారణకు సహకరించాలి కదా అని వ్యాఖ్యానించారు. అవినీతిలో కూరుకుపోయిన వాళ్లు తెదేపా నేతలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఐటీ సోదాలపైసంబంధిత శాఖ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెదేపా నేతల పేర్లు లేవని అన్నారు. వివేకా హత్యకేసుపై ఎన్నిసార్లు మాట మారుస్తారని సీఎం జగన్​ను నిలదీశారు. ప్రతిపక్షంలో ఉండి కూడా ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టారన్న ఆయన...వాటికి లెక్కలు చూపించారా? అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details