ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉభయ గోదావరి డెల్టాలకు డిసెంబరు 1 నుంచి నీటి సరఫరా - గోదావరి జిల్లాల సాగునీటి సలహా మండలి సమావేశం వార్తలు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉభయ గోదావరి జిల్లాల సాగునీటి సలహా మండలి సమావేశం జరిగింది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాల్వలకు డిసెంబరు 1 నుంచి మార్చి 31 వరకు 120 రోజులు నీటి సరఫరా చేయాలని సమావేశంలో తీర్మానించారు. తూర్పు గోదావరి జిల్లాలో 4.36 లక్షల ఎకరాలు, పశ్చిమగోదావరి జిల్లాలో 4.06 లక్షల ఎకరాల సాగు, తాగు నీటి అవసరాలకు 90.22 టీఎంసీల నీరు అవసరం అవుతుందని అధికారులు తెలిపారు.

Godavari districts
Godavari districts

By

Published : Nov 24, 2020, 7:01 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో.. ఉభయ గోదావరి జిల్లాల సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రెండు జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాల్వలకు డిసెంబరు 1 నుంచి మార్చి 31 వరకు 120 రోజులు నీటి సరఫరా చేయాలని సమావేశంలో తీర్మానించారు. పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాం నిర్మాణంలో భాగంగా నీటి సరఫరా మార్చి 31 తర్వాత నిలిపి వేయాల్సిన అవసరం ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లాలో 4.36 లక్షల ఎకరాలు, పశ్చిమగోదావరి జిల్లాలో 4.06 లక్షల ఎకరాల సాగు, తాగు నీటి అవసరాలకు 90.22 టీఎంసీల నీరు అవసరం అవుతుందని అధికారులు తెలిపారు. మరో వారం నుంచి పదిహేను రోజులు నీటి సరఫరా పెంచాలని ప్రజా ప్రతినిధులు, రైతు సంఘం నాయకులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రులు అధికారులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details