ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TALKING PARROT: అబ్బురపరుస్తున్న 'మాక్స్​'..ఏమంటుందంటే.. - talking parrot at Former MP home

మంచిగా మాట్లాడేవారి మాటల్ని చిలక పలుకులతో పోలుస్తాం. అలాంటిది మనలాగా పలికితే ఆనందం, ఆశ్చర్యమే కదూ...రాజమహేంద్రవరంలో ఓ చిలుక పలుకులు అందరినీ అబ్బురపరుస్తున్నాయి.

parrot
ముద్దులొలికే చిలుక

By

Published : Sep 6, 2021, 3:44 PM IST

ఆ చిలుక పలుకులు ముద్దులొలుకుతున్నాయి. చిన్నిచిన్ని మాటలతో అందరినీ అబ్బురపరుస్తోంది. మాజీ ఎంపీ హర్షకుమార్‌ రాజమహేంద్రవరంలోని తన ఇంట్లో ఏడేళ్లుగా ఆ చిలకను పెంచుతున్నారు. దానికి మాక్స్‌ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. అలాగే మాటలు నేర్పించారు. మనం మాట్లాడే మాటలను అది కూడా అనుసరిస్తోంది. ఈ చిలక అమెజాన్‌ ప్రాంతానికి చెందినదని.. తమ ఇంట్లో భాగమైందని మాజీ ఎంపీ హర్షకుమార్‌ చెబుతున్నారు.

ఏడేళ్ల క్రితం ఈ మకావో చిలుకను ఆయన కుమారుడు తీసుకొచ్చారు. అప్పటినుంచి ఇది మాజీ ఎంపీ ఇంట్లో భాగమైంది. ఇది మనం మట్లాడే వివిధ మాటలు ఇట్టే పలుకుతుంది. హలో, బాగున్నారా, జై భీమ్, జై హర్ష, తోటకూర ఇలా పలు పదాలు వల్లె వేస్తూ.. అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ మకావో చిలుక సన్ ఫ్లవపర్ గింజల్ని ఆహారంగా తీసుకుంటుంది. అలాగే పిస్తా, కొన్ని రకాల పళ్లు కూడా ఆరగిస్తుంది. దీనికి కోపం కూడా కాస్త ఎక్కువే. పెద్ద బోనులో పెట్టి దీనిని పెంచుతున్నారు. ఇది అమెజాన్ ప్రాంతానికి చెందిందని..తమ ఇంట్లో భాగమైందని హర్షకుమార్ చెబుతున్నారు.

ముద్దులొలికే చిలుక

ఈ చిలుకతోపాటు జపాన్​కు చెందిన చేపలు ఇంటి వరండాలో పెంచుతున్నారు. సందర్శకుల్ని ఇవన్నీ ఇట్టే ఆకర్షిస్తున్నాయి.

ఇదీ చదవండీ..TRANSGENDER: ట్రాన్స్‌జెండర్ల రిజర్వేషన్​పై హైకోర్టులో విచారణ

ABOUT THE AUTHOR

...view details