లాక్డౌన్ కారణంగా తెలంగాణ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి భక్తుల దర్శనాలు నిలిపివేసిన నేపథ్యంలో అక్కడ ఉండే వానరాలు ఇబ్బంది పడుతున్నాయి. గతంలో దేవాలయాలకు వెళ్లి వచ్చేవారు వాటికి ఆహారం అందించేవారు.
ఆహారం అందిస్తూ... దానిలో సంతోషం వెతుక్కుంటూ... - lock down effect on animals news
లాక్డౌన్ కారణంతో మనుషులే కాదు... మూగజీవాలు సైతం ఇబ్బందులు పడుతున్నాయి. తెలంగాణలోని యాదాద్రిలోని కోతులు ఆకలితో అలమటిస్తున్న ఇబ్బందులను గుర్తించిన కొందరు యువకులు వాటి ఆకలి తీర్చేందుకు ముందుకు వచ్చారు.
food-distribution-for-animals-at-yadadri-temple
కానీ లాక్డౌన్ కారణంగా ఎవరూ రాక.. కోతులు ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నాయి. వాటి బాధను గుర్తించి... ఆకలి తీర్చడానికి జంతు ప్రేమికులు ముందుకొస్తున్నారు. పండ్లు, చిరుధాన్యాలు అందిస్తూ వాటి ఆకలి తీరుస్తున్నారు. వాటికి ఆహారం అందిచండంలోనే తమకు సంతోషం ఉందని యువకులు చెబుతున్నారు.
ఇవీ చూడండి:మాస్కులపై ఏదీ దారి..?