తూర్పు గోదావరి జిల్లాలో శబరి, గోదావరి నదులు నిలకడగా ఉన్నాయి. గిరిజన గ్రామాల ప్రజలు ఇంకా మరపడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. పలు గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. ముంపు గ్రామాల్లో వైద్య సిబ్బంది ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. అటు విలీన మండలాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. పోలవరం ఏజెన్సీలో వరద కొనసాగుతోంది. 8 రోజులుగా 19 గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. పైడిపాక, కొత్తూరు గ్రామాల్లో ఇళ్లు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 6 రోజులుగా ప్రజలు వరదతో ఇబ్బందులు పడుతున్నారు. పోలవరం గిరిజన గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. లంక గ్రామాల చుట్టూ గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది.
గోదారి వరద తగ్గినా.. ముంపు ముప్పు తీరలేదు! - godavari floods
తీర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 12.1 అడుగుల నీటిమట్టం ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. డెల్టా కాల్వలకు 10,800 క్యూసెక్కులు వదులుతుండగా... సముద్రంలోకి 12.51 లక్షల క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారు.
ముంపులోనే గిరిజన గ్రామాలు