శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. 2,59,665 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయంలోకి చేరుతున్నాయి. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 866.80 అడుగులకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 129.15 టీఎంసీలు ఉంది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులు వదులుతున్నారు. హంద్రీనీవాకు 1,013 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
ఆల్మట్టి జలాశయానికీ వరద కొనసాగుతోంది. ఆల్మట్టి జలాశయానికి ఇన్‌ఫ్లో 2,79,332 క్యూసెక్కులు ఉండగా... 3,20,535 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా...ప్రస్తుతం 96.859 టీఎంసీలు నీటినిల్వ ఉంది.