తూర్పు గోదావరి జిల్లాలో.. గోదావరి నది పాయలు, ఉప్పుటేరు చెరువుల్లో చేపలు వేటాడి జీవించే కుటుంబాలు చాలా ఉన్నాయి. వీరు ప్రస్తుతం ఉపాధి లేక పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఇప్పటికే సముద్రంలో వేట నిషేధం అమలవుతోంది. ఆ సమయంలో మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకుంటోంది. కానీ... ఇతర వాగులు, వంకలు, చెరువుల్లో చేపలు పట్టుకుని విక్రయించి కుటుంబాలను పోషించుకునే వారికి... ఆర్థిక సహాయం అంటూ ఏమీ అందక పూట గడవడమే కష్టంగా మారింది. వారంతా.... లాక్‌డౌన్‌తో అల్లాడుతున్నారు. వేటాడిన చేపలను అమ్ముకునేందుకు సమయం సరిపోవడం లేదు. ఇలాంటి వాళ్లంతా.. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
గంగపుత్రులు.. గంపెడు కష్టాలు - మత్స్యకారుల కష్టాలు
కరోనా నియంత్రణకు తప్పనిసరైన లాక్‌డౌన్‌తో.. వివిధ రంగాల వారు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. వీరిలో మత్స్యకారుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది.
లాక్‌డౌన్‌తో మత్స్యకారులు ఇబ్బందులు