Fake CBI Agents in Police Custody: నకిలీ సీబీఐ ఏజెంట్ల ముఠాను రాజమహేంద్రవరంలో.. తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 13న హైదరాబాద్ గచ్చిబౌలిలో జయభేరి ఆరెంజ్ కౌంటిలోని సి-బ్లాక్‌లోని అపార్టుమెంట్‌లోని స్థిరాస్తి వ్యాపారి వెంకటసుబ్రహ్మణ్యం ఇంట్లోకి ఆగంతకులు ప్రవేశించారు. సీబీఐ అధికారులమంటూ అక్కడున్నవారికి చెప్పారు. అనంతరం ఇల్లంతా సోదాలు చేయాలంటూ నిందితులు హడావిడి చేసి.. కిలోకు పైగా బంగారం, రూ.2 లక్షల నగదుతో ఉడాయించారు.
Fake CBI Agents in Police Custody: పోలీసులకు చిక్కిన నకిలీ సీబీఐ ఏజెంట్ల ముఠా.. అదుపులో నలుగురు
Fake CBI Agents in Police Custody: నకిలీ సీబీఐ ఏజెంట్ల ముఠాను రాజమహేంద్రవరంలో.. తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 13న హైదరాబాద్ గచ్చిబౌలిలో జయభేరి ఆరెంజ్ కౌంటిలోని స్థిరాస్తి వ్యాపారి వెంకటసుబ్రహ్మణ్యం ఇంట్లో ఈ ముఠా చోరీకి పాల్పడింది.
Gachibowli Fake Rides: బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఈ రోజు ఉదయం రాజమహేంద్రవరంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నలుగురుని అదుపులోకి తీసుకోగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరంతా పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ముఠాకు సహకరించిన వారి వివరాలను సేకరిస్తున్నారు.
ఇదీ చూడండి:Young man died while moving marijuana: గంజాయి తరలిస్తుండగా ప్రమాదం..యువకుడు మృతి