రాష్ట్ర ప్రభుత్వం గురువారం లాంఛనంగా ప్రారంభించిన 'జగనన్న విద్యా కానుక' పథకం పేరుకే కొత్తదని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైకాపా ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారు. గత తెదేపా హయాంలో ఏ తప్పులను జగన్ విమర్శించారో....వాటినే ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. పథకాలు అమలు కన్నా ప్రచారానికే ఎక్కువ నిధులను ఖర్చుచేస్తున్నారని ఆరోపించారు.
'విద్యా కానుక' పథకం పాతదే....పేరు కొత్తది: హర్షకుమార్
జగనన్న విద్యా కానుక పథకం పాతదేనని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. పథకాల పేరుతో ప్రచారానికే వైకాపా సర్కార్ ఎక్కువ ఖర్చు చేస్తోందని అన్నారు.
ex mp harsha kumar
అలాగే సన్నబియ్యం పేరుతో పేదలను వైకాపా మోసం చేసిందన్న హర్షకుమార్... వాలంటీర్ వ్యవస్థ ఎందుకు పెట్టారో సీఎం జగన్‌కే తెలియాలని ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శిరోముండనం బాధితుడికి తాను అండగా ఉంటానని హర్షకుమార్ చెప్పారు. న్యాయం జరగకపోతే బాధితుడిని రాష్ట్రపతి వద్దకు తీసుకువెళతానని హామీ ఇచ్చారు.