విశాఖ ఉక్కును ప్రైవేట్‌పరం చేస్తే ప్రజలు సహించబోరని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. పరిశ్రమను కాపాడుకోకపోతే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని విచారం వ్యక్తం చేశారు. తనపై ఉన్న కేసుల దృష్ట్యా సీఎం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.
ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర అని అంటున్నారని విమర్శించారు. పరిశ్రమ నష్టాలను పూడ్చడానికి భూములు అమ్మేస్తారా అని నిలదీశారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హర్షకుమార్ హెచ్చరించారు.