ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజమహేంద్రవరాన్ని కబ్జాకోరుల రాజ్యంగా మార్చారు: జవహర్ - ex minister jawahar fiers on cm jagan latest news

వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత, మాజీమంత్రి జవహర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం పార్లమెంటరీ పరిధి పూర్తిగా కబ్జాకోరుల రాజ్యంగా మారిందని ఆరోపించారు. తెదేపా నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.

ex minister jawahar
ex minister jawahar

By

Published : Oct 8, 2020, 5:37 PM IST

రాజమహేంద్రవరం పార్లమెంటరీ పరిధి పూర్తిగా కబ్జాకోరుల రాజ్యంగా మారిందని మాజీ మంత్రి జవహర్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రామవరంలో ఏర్పాటు చేసిన అనపర్తి నియోజకవర్గ తెదేపా ముఖ్య నేతల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన జవహర్.... రాజమహేంద్రవరం పరిధిలో భూకబ్జాలు, మైనింగ్ తవ్వకాలు యథేచ్చగా సాగుతున్నాయన్నారు. జగన్​ చేస్తున్న దళిత వ్యతిరేక కార్యక్రమాలను దళితులందరూ ఐక్యమత్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వైకాపా పాలన మొత్తం వేధింపుల రాజ్యంగా సాగుతోందని... అనపర్తి నియోజకవర్గంలోని తెదేపా కార్యకర్తలపై 89 కేసులు పెట్టారన్నారు.

అనపర్తిలో పులివెందుల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తెదేపాను అధికారంలోకి తీసుకొచ్చేందుకు సమిష్టిగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details