బెయిల్ మంజూరు అయి బయటకు వచ్చిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కలిసేందుకు తెదేపా నాయకులు రాజమండ్రికి బయలుదేరారు. వీరిని మార్గమధ్యలో పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా చందర్లపాడు, నందిగామ, వీరులపాడు, కంచికచెర్ల మండలాలకు చెందిన మరికొంత మందిని గృహనిర్భంధం చేశారు. నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను నిన్నటి నుంచి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తమ నాయకుడిని కలవడానికి వెళ్తుంటే అడ్డుకోవడం ఏమిటని పోలీసులను ప్రశ్నించారు. వైకాపాకి ఒక న్యాయం తమకొక న్యాయమా అని సౌమ్య ప్రశ్నించారు.
HOUSE ARREST: తెదేపా నాయకుల గృహనిర్భంధం.. - Former minister Devineni Umamaheswararao granted bail
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్ మంజూరు కావడంతో ఆయనను కలిసేందుకు తెదేపా నాయకులు రాజమండ్రికి ఈ రోజు ఉదయం బయలుదేరారు. వీరిని మార్గమధ్యలో పోలీసులు అరెస్ట్ చేశారు.

మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య